News February 11, 2025
ఉపాధి పనులలో పురోగతి ఉండాలి: కలెక్టర్

ఉపాధి హామీ పనులలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి కూలీల మొబిలైజేషన్, సగటు వేతనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేలో రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
Similar News
News October 20, 2025
నేడు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం (ప్రభుత్వ సెలవు దినం) కావడంతో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.
News October 20, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్ కీలక సూచన

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజైనందున ఈనెల 20న సోమవారం ఒంగోలు PGRS హాల్లో జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరని జిల్లా కలెక్టర్ అన్నారు. కాగా జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలను కలెక్టర్ చెప్పారు.
News October 19, 2025
ప్రమాదం జరిగితే ఇలా చేయండి: ప్రకాశం SP

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి రోజు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101కు సమాచారం అందించాలన్నారు. అలాగే పోలీస్ డయల్ 100, 112 నెంబర్లను సైతం సంప్రదించవచ్చని తెలిపారు. కాలుష్య రహిత టపాసులను ప్రజలు కాల్చాలని ఎస్పీ పిలుపునిచ్చారు.