News March 13, 2025
ఉపాధి హామీలో వికారాబాద్ జిల్లా టాప్..!

వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. జిల్లాలోని కుల్కచర్ల, పరిగి, మర్పల్లి, నవాబ్పేట, మోమిన్పేట, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల్ తదితర మండలాల్లో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈనెలలో అత్యధికంగా 22వేల మంది కూలీలకు అదనపు పనిని కల్పించడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు డీఆర్డీవో శ్రీనివాస్ సూచనలతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు సాగుతున్నాయి.
Similar News
News November 23, 2025
నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.
News November 23, 2025
గోదూరులో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

JGTL(D)లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గోవిందారంలో అత్యల్పంగా 14.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలాపూర్లో 15.2, గుల్లకోట 15.3, మల్లాపూర్ 15.4, కథలాపూర్ 15.6, వెల్గటూర్, మల్యాల 15.7, మన్నెగూడెం, ఎండపల్లి 15.8, రాఘవపేట, ఐలాపూర్ 15.9, పెగడపల్లి 16, సారంగాపూర్, మేడిపల్లి, రాయికల్, నెరెళ్ల, కోల్వాయి, పొలాస 16.1, పూడూర్ 16.2, బుద్దేశ్పల్లి, జగ్గాసాగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.3C°గా నమోదైంది.
News November 23, 2025
SRD: డీసీసీ పదవి.. ముగ్గురు మొనగాళ్లు!

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను శనివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్, సిద్దిపేట జిల్లాలను సైతం ఈ జాబితాలో చేర్చారు. సంగారెడ్డి DCC అధ్యక్ష పదవిని పెండింగ్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ఆశావహుల కోసం ముగ్గురు కీలక నేతలు పావులు కదపడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తర్జనభర్జన పడి చివరకు SRDని పక్కన పెట్టారు.


