News April 4, 2025
ఉపాధి హామీ పథకంలో కోనసీమ ఫస్ట్: కలెక్టర్

ఉపాధి హామీ పథకం ద్వారా కోనసీమ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల ఉపాధి వేతనదారులకు పని కల్పించామని కలెక్టర్ మహేష్‌కుమార్ గురువారం తెలిపారు. 57 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 56.80 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. రోజువారీ సగటు వేతనం రూ.291.20 చెల్లించామన్నారు. కూలీలకు వేతనాల కింద రూ. 165.43 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Similar News
News December 7, 2025
మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.
News December 7, 2025
తిరుపతి: అటు ర్యాగింగ్… ఇటు లైంగిక వేధింపులు

ఎస్వీయూలో ఇటీవల ర్యాగింగ్ కలకలం.. తాజాగా NSU లైంగిక వేధింపులతో తిరుపతి విద్యా కేంద్రానికి చెడ్డపేరు వచ్చింది. ఇలాంటి విద్యాలయాల్లో యువతులకు భద్రత ఎంత? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీల కమిటీలు, మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వర్సిటీల అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి.
News December 7, 2025
బాపట్ల: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

బాపట్ల జిల్లాలో చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నేడు జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ఉదయం 10- మ.1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుందన్నారు.


