News December 29, 2024

ఉపాధి హామీ పథకం.. నాగర్‌కర్నూల్ టాప్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,70,214 జాబ్ కార్డులు ఉన్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో జాబ్ కార్డులు ఉన్నాయి. దాదాపు 20 లక్షల కూలీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పురుషుల కంటే మహిళలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సుమారుగా 3,000 పైగా కుటుంబాలు వందరోజుల పనులను పూర్తి చేసుకున్నారు.

Similar News

News January 16, 2025

ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS.!

image

✔పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం✔GDWL:పట్టుచీర ఆకారంలో సంక్రాంతి ముగ్గు✔Way2Newsతో ముచ్చటైన ముగ్గురు✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔NGKL:ఘనంగా బండలాగుడు పోటీలు✔ప్రారంభమైన ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు✔వీపనగండ్ల:పాము కాటుతో అత్త,కోడలు మృతి✔MBNR:’CRICKET జట్టు తమిళనాడు ప్రయాణం’✔26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ✔సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యేలు

News January 15, 2025

MBNR: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.!

image

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 19 వరకు ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.❤️ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌.❤️ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ.❤️మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌.❤️మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్‌.❤️జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్‌.❤️జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.

News January 15, 2025

ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఇలా

image

నాగర్‌కర్నూల్‌ జిల్లా రంగాపూర్‌ సమీపంలోని ఉమామహేశ్వరుడి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఇలా..
✦ 15న నుంచి ప్రభోత్సవం, పల్లకీ సేవ
✦ 16న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం,
✦ 18న కుంకుమార్చన, రుద్రాభిషేకం, హోమం
✦ 19న ధ్వజారోహణం, త్రిశూల స్నానం తదితర పూజలు
✦ 16 నుంచి 22 వరకు పాపనాశనం వద్ద ఉత్తరాయణ పుణ్యకాల స్నానాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి.