News April 25, 2024

ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఐటీడీఏ పీఓ

image

ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ ఆనందపురం పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణ ఇటీవల పరీక్షల సమయంలో పాఠశాలకు రాలేదు. స్థానికంగా ఉన్న అంగన్వాడికి పరీక్ష నిర్వహించాలని ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి పాఠశాల తనిఖీ చేయగా కృష్ణ స్కూలుకు రాలేదని తేలింది. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ పీఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 12, 2025

ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

image

దేశంలో ఫార్మా పీఎస్‌యూ (పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్‌యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

News December 12, 2025

విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక: అదనపు కలెక్టర్

image

విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ వరదల సమయంలో నీటి విడుదల కోసం పైనున్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని సూచించారు.

News December 12, 2025

బోనకల్ సర్పంచ్‌గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

image

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.