News July 16, 2024
ఉపాధ్యాయురాలి సస్పెండ్..

కొత్తగూడెం బూడిదగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న తుమ్మ పద్మావతిని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సస్పెండ్ చేశారు. రామచంద్రఎయిడెడ్ పాఠశాల ప్రవేశాలు లేకపోవటంతో 2018లో మూతపడింది. ఆ పాఠశాలలో 2004-14మధ్యకాలంలో పద్మావతి HMగా పనిచేశారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని అప్పటి కలెక్టర్ అనుదీప్కు ఫిర్యాదు రాగా.. ఆయన విచారణకు ఆదేశించారు. గత నెలలో నివేదిక సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్, పద్మావతిని సస్పెండ్ చేశారు.
Similar News
News December 6, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
News December 6, 2025
మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.
News December 6, 2025
పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.


