News July 16, 2024

ఉపాధ్యాయురాలి సస్పెండ్‌..

image

కొత్తగూడెం బూడిదగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న తుమ్మ పద్మావతిని కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ సస్పెండ్‌ చేశారు. రామచంద్రఎయిడెడ్‌ పాఠశాల ప్రవేశాలు లేకపోవటంతో 2018లో మూతపడింది. ఆ పాఠశాలలో 2004-14మధ్యకాలంలో పద్మావతి HMగా పనిచేశారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని అప్పటి కలెక్టర్‌ అనుదీప్‌కు ఫిర్యాదు రాగా.. ఆయన విచారణకు ఆదేశించారు. గత నెలలో నివేదిక సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్, పద్మావతిని సస్పెండ్‌ చేశారు.

Similar News

News October 12, 2024

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి

image

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయబోతున్నామని పేర్కొన్నారు. మహిళలతో కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇందిరా మహిళా డెయిరీని చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు.

News October 12, 2024

కొత్తగూడెం: దసరా పండుగ వెలుగులు నింపాలి: కలెక్టర్

image

దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఊరూ, వాడా, చిన్నా,పెద్దా తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో ఎంతో సందడి చేశారని అన్నారు.

News October 12, 2024

మధిర: వాహన పూజలు చేసిన డిప్యూటీ సీఎం

image

విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తన క్యాంపు కార్యాలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.