News June 23, 2024
ఉపాధ్యాయులకు MLA రోషన్ ఆదేశాలు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. స్కూలు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని స్కూలు ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. పాఠ్య పుస్తకాలు సక్రమంగా పంపిణీ చేయాలని, మౌళిక వసతులు మెరుగు పరచాలని సూచించారు
Similar News
News November 18, 2025
ప.గో. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కందుల భాను ప్రసాద్

పశ్చిమగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళ్రావు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.