News April 4, 2025
ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడగాలి: కలెక్టర్

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాలలో కొనసాగుతున్న అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులతో కాసేపు కలెక్టర్ ముచ్చటించారు. రోజు న్యూస్ పేపర్ చదివి వార్తలు తెలుసుకోవాలని అన్నారు. పాఠశాలలో మెనూ పాటించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 22, 2025
MDK: రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు ప్రాధాన్యత: ఎంపీ

రోడ్లు-రైలు మార్గ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. శనివారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్ ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన రవాణా వాతావరణాన్ని కల్పించాలన్నారు.
News November 22, 2025
మంత్రి ఆనం రేపటి పర్యటనా వివరాలు

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం జిల్లా పరిధిలో పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, దేవాలయ ప్రాంగణంలో అనివేటి మండపం నిర్మాణానికి వెంకటగిరి MLAతో కలిసి పాల్గొననున్నారు.
News November 22, 2025
ములుగు: ఎస్పీ కేకన్‌ను కలిసిన ఓఎస్డీ శివమ్

ములుగు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌ను, ఓఎస్డీ శివమ్ ఉపాధ్యాయ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ఆయా సర్కిళ్ల సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సమావేశమైన ఎస్పీ, జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.


