News March 4, 2025
ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటంవల్లే ఓడిపోయాను: రఘువర్మ

ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటం వల్లే ఓడిపోయానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అన్నారు. ఆరేళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానన్నారు. గత ఎన్నికల్లో యూటీఎఫ్తో కలిసి పోటీ చేసి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి విడివిడిగా పోటీ చేయడం కూడా ఓటమికి ఒక కారణం అన్నారు. ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉందని అది తనమీద కాదన్నారు.
Similar News
News November 24, 2025
ఉయ్యాలవాడకు వైఎస్ జగన్ నివాళి

ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు చేసి బ్రిటీష్ వ్యతిరేక పోరాటానికి నాంది పలికిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నరసింహారెడ్డి పేరు పెట్టడం మనందరికీ గర్వకారణమని జగన్ పేర్కొన్నారు.
News November 24, 2025
హైదరాబాద్ మెట్రో రైల్.. పర్మిషన్ ప్లీజ్

నగరంలో రోజూ లక్షలాదిమందిని మెట్రో ట్రైన్ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ సేవలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను ప్రతిపాదిస్తూ DPR( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను కేంద్రానికి పంపింది. గత సంవత్సరం నవంబర్లో ఒకటి, ఈ సంవత్సరం జూన్లో మరో ప్రతిపాదన అందజేసింది. 163 కిలోమీటర్ల వరకు మెట్రోను విస్తరిస్తామని పేర్కొంది. అయితే ఇంతవరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
News November 24, 2025
సిద్దిపేట: పంచాయతీ పోరుకు రిజర్వేషన్లు ఖరారు

సిద్దిపేట జిల్లాలో మొత్తం 508 గ్రామాలకు సర్పంచులు, 4,508 వార్డు సభ్యుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపించింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఆయా మండలాల రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఆదివారం డ్రాలు తీశారు. జనరల్కు 254, బీసీలకు 132, ఎస్సీలకు 97, ఎస్టీలకు 25 సర్పంచ్ స్థానాలు కేటాయించినప్పటికీ అధికారికంగా గెజిట్ విడుదల చేయాల్సి ఉంది.


