News March 4, 2025

ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటంవల్లే ఓడిపోయాను: రఘువర్మ

image

ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటం వల్లే ఓడిపోయానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అన్నారు. ఆరేళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానన్నారు. గత ఎన్నికల్లో యూటీఎఫ్‌తో కలిసి పోటీ చేసి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి విడివిడిగా పోటీ చేయడం కూడా ఓటమికి ఒక కారణం అన్నారు. ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉందని అది తనమీద కాదన్నారు.

Similar News

News March 17, 2025

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

image

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

News March 17, 2025

రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: KTR

image

TG: ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ ఒప్పుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో అంతా బానే ఉందని కాంగ్రెస్ నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పెట్టుబడులు, వ్యవసాయ రంగ వృద్ధి, సంపద, సీఎం పనితీరు మెరుగ్గా ఉందని చెబుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు, విధానాల ఫలితమే ఈ ప్రతికూల వృద్ధి అని పేర్కొన్నారు.

News March 17, 2025

మెదక్: ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

image

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

error: Content is protected !!