News February 11, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో పీఆర్టీయూ ప్రతినిధులు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వినియోగించాలి. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థి పేరుకు ముందు 1 అంకె వేయాలి. తర్వాత 2, 3, 4, 5 ఇలా ఎన్ని అంకెలైనా వేయవచ్చు. 1 అంకె వేయకుండా మిగిలిన అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. టిక్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు.
Similar News
News December 21, 2025
రాజీ మార్గమే రాజా మార్గం: సివిల్ జడ్జి

రాజీయే రాజమార్గం అని, జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం పొందవచ్చని ASF సెషన్ సివిల్ జడ్జ్ యువరాజ అన్నారు. ఆసిఫాబాద్ కోర్టు ఆవరణలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 11,022 కేసులను పరిష్కరించి, రూ.55,62,865 జరిమానా విధించినట్లు తెలిపారు. క్షణికావేశంతో నమోదు చేసుకున్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని సూచించారు.
News December 21, 2025
జిల్లాలో 95% పోలియో చుక్కల పంపిణీ పూర్తి: DMHO

పల్నాడు జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. తొలిరోజే జిల్లా వ్యాప్తంగా 95% లక్ష్యాన్ని సాధించినట్లు DMHO రవి వెల్లడించారు. జిల్లాలో పోలియో చుక్కల పంపిణీ సంతృప్తికరంగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఆదివారం కేంద్రాలకు రాలేకపోయిన చిన్నారుల కోసం సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని తెలిపారు.
News December 21, 2025
సీఎం జిల్లా నుంచే మాజీ సీఎం పోరుబాట

TG: రెండేళ్ల తర్వాత యాక్టివ్గా కనిపిస్తున్న కేసీఆర్ కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో అక్కడి నేతలతో సమావేశమవ్వడమే కాకుండా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అటు నదీజలాల విషయంలో కేంద్రంలోని బీజేపీపైనా ఫైట్ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ హామీలకు జనం టెంప్ట్ అయి ఓటేశారని, ఈ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.


