News February 25, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, తహశీల్దార్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News February 25, 2025
పెళ్లై ఏడేళ్లు.. ఒకే కాన్పులో ముగ్గురు జననం

TG: గజ్వేల్ సమీపంలోని అడవిమజీద్‌కు చెందిన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నర్సింహులుతో నాగరత్నకు వివాహమవ్వగా ఏడేళ్లుగా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా గర్భం దాల్చింది. ఆదివారం ఆమెకు గజ్వేల్ ఆసుపత్రిలో ప్రసవం జరగగా ఇద్దరు మగ, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News February 25, 2025
రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. చౌదరిగూడెం మండలంలో 36.5℃, శంకర్‌పల్లి 36.4, సరూర్ నగర్ 36.3, మొయినాబాద్, ఫరూఖ్‌నగర్, షాబాద్ 36.2, మొయినాబాద్ 36.1, హయత్ నగర్ 35.9, చేవెళ్ల 35.7, రాజేంద్రనగర్ 35.6, ఇబ్రహీంపట్నం 35.6, కొందుర్గ్ 35.5, శేరిలింగంపల్లి, తలకొండపల్లి, బాలాపూర్ 35.4, అబ్దుల్లాపూర్ మెట్ 35.3, కేశంపేట, మహేశ్వరంలో 34.7℃గా నమోదైంది.
News February 25, 2025
రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రవాణా శాఖ మంత్రి

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటారు.