News March 29, 2025
ఉప్పలగుప్తంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి

మండల కేంద్రం ఉప్పలగుప్తంలో విద్యుదాఘతంతో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం, ఉప్పలగుప్తం మధురపేటకు చెందిన యువకుడు మధుర రాజేష్ (30) శుక్రవారం సాయంత్రం సాగు చేస్తున్న పొలానికి వెళ్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ వైర్లు తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు పీహెచ్సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురం తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News April 25, 2025
ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News April 25, 2025
కాగజ్‌నగర్ : నేడు, రేపు పలు రైళ్లు రద్దు

మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా కాగజ్‌నగర్‌కు రానున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కాగజ్ నగర్- ఆసిఫాబాద్ రైలు మార్గంలో మూడవ లైను నిర్మాణ పనులు చేపడుతున్నందున 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. BPQ-KZJ ఎక్స్‌ప్రెస్, పుష్ పుల్, కాఘజ్‌నగర్, భాగ్యనగర్, ఇంటర్సిటీ, సింగరేణి రైలు బెల్లంపల్లి వరకు నడవనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
News April 25, 2025
కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.