News March 17, 2025

ఉప్పలగుప్తం కాలువలో మృతదేహం లభ్యం

image

ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామం పరిధి అమలాపురం నుంచి చల్లపల్లి గ్రామం వైపు వెళ్లే పంట కాలువలో మృతదేహం కొట్టుకొచ్చింది. సుమారు 50 నుంచి 55 సంవత్సరములు గల గుర్తుతెలియని మగ మృతదేహం ఉప్పలగుప్తం పోలీసు గుర్తించారు. సదరు మృతదేహంను సరిపల్లె విఆర్ఓకీ ఉప్పలగుప్తం ఎస్ఐకి ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 16, 2025

రేపు కడప కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్‌తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.

News November 16, 2025

రాజన్న దర్శనాల నిలిపివేత.. గుడి బయటే మొక్కులు

image

రాజన్న దర్శనం కోసం వచ్చిన వందలాది మంది భక్తులు గుడి ముందు బహిరంగ ప్రదేశంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి భీమన్న ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలామంది భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించుకోకుండా తిరిగి వెళ్ళవద్దనే భావనతో ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టి దండం పెడుతున్నారు. దీంతో ఆలయ ముందు భాగంలో గేటు బయట సందడి నెలకొంది.

News November 16, 2025

ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

image

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.