News March 11, 2025
ఉప్పలగుప్తం: పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ప్రధాన పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 52 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష మృతదేహం గత మూడు రోజుల నుంచి కాలువలో కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు, పోలీసు ఇంతవరకు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని, దుర్వాసన వస్తుందని పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 23, 2025
జుట్టు ఆరోగ్యానికి ఆముదం

ప్రస్తుతకాలంలో చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి ఆముదం పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్, విటమిన్-ఇ , ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు మాడుపై రక్తప్రసరణను పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మాడుపై అలెర్జీ, వాపులను తగ్గించి తేమగా ఉండేలా చూస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించి జుట్టును ఆరోగ్యంగా చేస్తుందని చెబుతున్నారు. <<-se>>#Haircare<<>>
News October 23, 2025
WNP: ప్రజల నమ్మకం గెలిచేలా పోలీసులు పనిచేయాలి: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణే ప్రతి పోలీసు ప్రధాన ధ్యేయం కావాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని రామకృష్ణారెడ్డి గార్డెన్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆయన నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 23, 2025
MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి నెల వారి నేర సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైమ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి న్యాయస్థానాల్లో దోషులకు శిక్షపడేలా బలమైన సాక్ష్యాలు సేకరించాలన్నారు.