News March 11, 2025

ఉప్పలగుప్తం: పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

image

ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ప్రధాన పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 52 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష మృతదేహం గత మూడు రోజుల నుంచి కాలువలో కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు, పోలీసు ఇంతవరకు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని, దుర్వాసన వస్తుందని పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News March 6, 2026

SPMVV: రేపు శశికళ సిన్హాకు డాక్టరేట్ ప్రదానం

image

SPMVVలో శనివారం 22వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) జరుగునుంది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) అభివృద్ధికి ముఖ్య సేవలు అందించిన మహిళా శాస్త్రవేత్త శశికళ సిన్హా హాజరు కానున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఆమెకు శనివారం గౌరవ డాక్టరేట్ అందజేయనున్నట్లు తెలియజేశారు.

News March 6, 2026

ముంబై న్యూ జెర్సీలో హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.

News March 6, 2026

సంగారెడ్డి: జిల్లాస్థాయికి ‘వినూత్న హెల్మెట్’

image

వట్పల్లి మండలం పోతులబోగూడ మోడల్ స్కూల్ విద్యార్థి సాయికృష్ణ రూపొందించిన వినూత్న హెల్మెట్ జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. బైక్ వెనుక కూర్చున్న వారు మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించేలా ‘మాగ్నిఫర్వర్’ సాంకేతికతతో దీన్ని తయారు చేశారు. ఈ ఆవిష్కరణతో వాహనదారులు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సాయి వివరించారు. విద్యార్థి ప్రతిభను ప్రిన్సిపల్ అభినందించారు.