News March 5, 2025
ఉప్పలగుప్తం : వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఉప్పలగుప్తానికి చెందిన విద్యార్థిని మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. ఆమె భీమవరంలో బీఫార్మసీ చదువుతోంది. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తండ్రి మందలించాడని ఆత్మహత్యకు ప్రయత్నించింది. టౌన్ సీఐ వీరబాబు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. విద్యార్థిని కాపాడడంతో.. పెను ప్రమాదం తప్పింది.
Similar News
News November 1, 2025
జిల్లాలో పెరుగుతున్న ‘చలి పులి’

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తిరుమలాపూర్లో అత్యల్పంగా 20℃, పూడూర్ 20.3, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ 20.4, కథలాపూర్, సారంగాపూర్ 20.6, నేరెళ్ల, పెగడపల్లె 20.7, మన్నెగూడెం, గోవిందారం, పొలాస 20.8, రాఘవపేట, జగ్గసాగర్ 20.9, కోరుట్ల, గోదూరులో 21.1℃ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగితా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత అధికంగానే ఉంది.
News November 1, 2025
సిద్దిపేట: చేతులు మారుతున్న వైన్స్ !

సిద్దిపేటలో కొత్త వైన్స్ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. వైన్స్ టెండర్ 2025-27లో లక్కీడ్రా ద్వారా షాపులు దక్కినవారి చుట్టూ పలువురు వ్యాపారాలు ప్రదక్షిణలు చేస్తున్నారు. టెండర్లో జిల్లాకు చెందిన కొందరికి అసలే దక్కకపోగా, మరి కొందరు 30-45 టెండర్లు వేస్తే 3-4 దక్కాయి. దీంతో షాపులు దక్కనివారు గుడ్ విల్ ఇచ్చి తీసుకునేందుకు కోట్లలో ఆఫర్ ఇస్తున్నట్టు టాక్. గజ్వేల్లో ఓ షాపుకు రూ.1.4 కోట్ల ఆఫర్ ఇచ్చారట.
News November 1, 2025
కాశీబుగ్గ ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి <<18167876>>ఆలయ తొక్కిలాట దుర్ఘటన<<>>పై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి.. సంఘటన స్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది.


