News January 27, 2025
ఉప్పలగుప్తం: స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు పురస్కారం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ హోదాలలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో పాములను సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ సమాజ సేవ చేస్తున్న ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ కలెక్టర్ మహేశ్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మను పలువురు అభినందించారు.
Similar News
News November 29, 2025
క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లోని బాబా రాందేవ్కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

సిరిసిల్ల: సారూ.. ఇసుక ట్రాక్టర్ల దారి మళ్లించండి

ఇసుక ట్రాక్టర్ల దారి మార్చాలంటూ ఆదర్శనగర్, సాయినగర్ కాలనీ వాసులు ట్రాక్టర్లకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. తమ ఇండ్ల మధ్య నుంచి నిత్యం ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా వెళ్తున్నాయని, పిల్లలకు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణాతో దుమ్ము అధికంగా రావడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సీఐ, ఎస్సై అక్కడికి చేరుకుని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.