News January 27, 2025
ఉప్పలగుప్తం: స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు పురస్కారం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ హోదాలలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో పాములను సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ సమాజ సేవ చేస్తున్న ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ కలెక్టర్ మహేశ్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మను పలువురు అభినందించారు.
Similar News
News February 19, 2025
ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం
News February 19, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 19, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
ఇష: రాత్రి 7.32 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 19, 2025
శుభ ముహూర్తం (బుధవారం, 19-02-2025)

తిథి: బహుళ సప్తమి
నక్షత్రం: విశాఖ ఉ.8.11 నుంచి
శుభసమయం: ఉ.9.04 నుంచి 9.28 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36- మ.12.24
వర్జ్యం: మ.2.25 నుంచి మ.4.11 వరకు
అమృత ఘడియలు: రా.12.58 నుంచి రా.2.44 వరకు