News April 5, 2024

ఉప్పల్‌కు వచ్చే వాహనదారులకు అలర్ట్.. 

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉప్పల్ పరిధి ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. లారీ, డంపర్, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC ట్రక్, అన్ని ఇతర రకాల ట్రక్కులు, భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 

Similar News

News November 27, 2025

HYD: FREE‌గా వెళ్లొద్దాం రండి!

image

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.

News November 27, 2025

అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

image

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్‌ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్‌ కోసం ఇంజినీరింగ్‌ విభాగం వీటిని తయారుచేసింది.

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.