News February 9, 2025
ఉప్పల్‌లో డెలివరీ బాయ్ సూసైడ్!

ఉప్పల్ పీఎస్ పరిధి కురుమానగర్లోని ఓ ఇంట్లో వట్టిపల్లి శ్రావణ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి కురుమానగర్‌లో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని శ్రవణ్ కుమార్ సోదరుడు సందీప్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 5, 2025
శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

శ్రీశైలంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆయన గుడి పరిసరాలు, నంది మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
News November 5, 2025
NTR: గురుకుల విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్

ఇంటర్ చదివి, నీట్ పరీక్ష రాసిన ఏపీఎస్‌డబ్ల్యూఆర్, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులాల విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని NTR జిల్లా DCO ఎ. మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సబ్జెక్టు నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 5, 2025
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్‌ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్‌ఛైర్‌లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.


