News June 28, 2024
ఉప్పల్లో నల్గొండ జిల్లా నిరుద్యోగి సూసైడ్

ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.
Similar News
News November 25, 2025
జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
News November 25, 2025
NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
News November 25, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

NLG: మహిళా ఓట్ల కోసం వ్యూహం
NLG: కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఏర్పాట్లు వేగవంతం.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
NLG: ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
NLG: సర్కార్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం
నకిరేకల్: జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు
నార్కట్ పల్లి: ఎంజీయూ రిఫ్రిజిరేటర్లో కప్ప.. ఏబీవీపీ ధర్నా
NLG: టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఇదీ పరిస్థితి


