News March 30, 2025
ఉప్పల్‌లో యాక్సిడెంట్.. లేడీ ఆఫీసర్ మృతి

ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎక్సైజ్ ఉద్యోగి స్వరూప రాణి(58) అక్కడికక్కడే మృతి చెందింది. బోడుప్పల్ జ్యోతినగర్‌కి చెందిన స్వరూపా రాణి(58) శంషాబాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడ్మిన్‌గా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా శంషాబాద్‌కు వెళ్లిన స్వరూపా రాణి విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
Similar News
News October 23, 2025
HYD: నిమ్స్‌లో అత్యాధునిక శస్త్రచికిత్స పరికరాలు

HYD నిమ్స్ ఆస్పత్రిలోని శస్త్రచికిత్స గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేసింది. శస్త్రచికిత్స గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో రూ.2 కోట్ల విలువైన రెండు అధునాతన పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని డైరెక్టర్ ప్రొఫెసర్ నాగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సాంకేతికతలు శస్త్రచికిత్సలో కచ్చితత్వం, రోగి భద్రత, క్లినికల్ సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రొఫెసర్ పేర్కొన్నారు.
News October 23, 2025
HYD: నిమ్స్‌లో చరిత్రాత్మక ప్రక్రియ..!

నిమ్స్ కార్డియాలజీ విభాగం పల్మనరీ ఆర్టరీ డెనర్వేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి అవగా దేశంలో ఆరోది. తీవ్ర పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఓ చెన్నై మహిళకు ప్రొ.రమాకుమారి బృందం ఈ అత్యాధునిక కేథటార్ చికిత్స అందించింది. రోగి పీఏ ప్రెజర్ 105 నుంచి 88 mmHgకి తగ్గింది. ఈ విజయాన్ని డైరెక్టర్ ప్రొ.బీరప్ప ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో చారిత్రక ఘనత అని కొనియాడారు.
News October 23, 2025
ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మేకప్, ఇన్స్టంట్ పరీక్షా ఫీజును ఈనెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.800 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.