News March 27, 2025
ఉప్పల్లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
Similar News
News December 4, 2025
HYD- విజయవాడ హైవే విస్తరణకు జనవరిలో టెండర్: మంత్రి

HYD నుంచి విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి జనవరిలో టెండర్ పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైలం అడవి మార్గంలో రోడ్డు విస్తరణ చేసే అవకాశం లేకపోవడంతో, సింగల్ ఫ్లై ఓవర్ మంజూరు చేసినట్లు తెలిపారు. విజయవాడ హైవే విస్తరణ అద్భుతంగా జరుగుతుందని పేర్కొన్నారు.
News December 4, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)7 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. సీనియర్ ఇంజినీర్ పోస్టుకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://bel-india.in
News December 4, 2025
పిల్లలను ముద్దు పేరుతో పిలుస్తున్నారా?

పిల్లలను ముద్దు పేర్లతో కాకుండా సొంత పేర్లతో పిలవడం శుభకరమని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆ పేరులోని సానుకూల శక్తి వారికి బదిలీ అవుతుందని అంటున్నారు. ‘పెద్దలు జన్మ నక్షత్రం ప్రకారం నామకరణం చేస్తారు. అందుకే ఆ పేరుతో పిలిస్తే.. ఆ పేరుకు సంబంధించిన గ్రహబలం, శుభ ఫలితాలు వారికి లభిస్తాయి. అలా పిల్వకపోతే ప్రతికూల శక్తులు వారిని ఆకర్షిస్తాయి’ అని చెబుతున్నారు.


