News July 18, 2024
ఉప్పల్: అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆహ్వానం

HCA ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-16 స్కూల్, జూనియర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ 2024-25లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. రూ.1000 ఫీజు చెల్లించి జట్టు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జులై 20, 2024గా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం HCA అధికారిక వెబ్సైట్ https://www.hycricket.org/ని పరిశీలించాలని సూచించారు. SHARE IT
Similar News
News November 30, 2025
రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
News November 30, 2025
HYD: సీఎం పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో తరలించడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సీఎం పర్యటనను నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు.
News November 30, 2025
రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్లకు 929 నామినేషన్లు

తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లను ఆహ్వానించగా.. సర్పంచ్కు 929 నామినేషన్లు, వార్డులకు 3,327 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ మూడో తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది.


