News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కర్నూలు శివారు చిన్నటేకూరులో జరిగిన ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు కర్నూలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బస్సు ప్రయాణకుల బంధువులు 08518-277305 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News October 24, 2025
మంచిర్యాల: కూతురింటికి వెళ్తూ చనిపోయారు

జన్నారం మొర్రిగూడ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI అనూష ప్రకారం.. ఉట్నూర్ మం. ఘన్పూర్ వాసి అంకన్న(50), నాగపూర్ వాసి మోతీరాం(50) బైక్పై దండేపల్లిలో ఉన్న కూతురింటికి బయలుదేరారు. ఈక్రమంలో <<18081961>>మొర్రిగూడ <<>>వద్ద ఉట్నూర్ వైపు వెళ్తున్న బొలెరో- బైక్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో అంకన్న, మోతీరాం అక్కడికక్కడే చనిపోయారు. జైనూర్కి చెందిన బొలెరో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.
News October 24, 2025
పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవు: కలెక్టర్

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి ఎంఆర్ఓలతో సంప్రదించి అవసరమైతే శుక్రవారం పాఠశాలకు సెలవు మంజూరు చేయాలని డీఈఓను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని కలెక్టర్ ఆదేశాలను డీఈఓ ఎంఈఓలకు పంపారు.


