News February 20, 2025

ఉప్పల్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటేనే ఆరోగ్యం..!

image

సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే సాధారణ బరువు, బీపీ, షుగర్ నార్మల్ ఉండాలని ఉప్పల్ UPHC డాక్టర్లు అన్నారు. ఇవి నార్మల్ ఉంటే ఆరోగ్యకరమైన మనస్సు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం, గుండె ఆరోగ్యకరంగా ఉండి మన జీవనం పచ్చని ఆకులు కలిగిన చెట్టుల ఉంటుందన్నారు. అదే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే మానసిక రుగ్మతలు, క్యాన్సర్, గుండెపోటు,కిడ్నీ వైఫల్యాలతో ఎండిపోయిన చెట్టులా మన పరిస్థితి మారుతుందన్నారు.

Similar News

News September 18, 2025

కరవాకలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

మామిడికుదురు మండలంలోని కరవాకలో వైనుతీయ నది తీరం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై చైతన్య కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

చిన్నమండెం: గుండెపోటుతో టీచర్ మృతి

image

చిన్నమండెం మండలం చాకిబండ తెలుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బీవీ శ్రీధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో చనిపోయారు. ఆయన మృతి పట్ల మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.

News September 18, 2025

కర్నూలు మార్కెట్ యార్డుకు నేడు, రేపు సెలవు

image

కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బి.నవ్య తెలిపారు. మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఉల్లిని ట్రేడింగ్, బహిరంగ వేలం ద్వారా బయటకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇవాళ, రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.