News December 26, 2024
ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్యాలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో కూచిపూడి నాట్య గురువు సాత్విక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మహాగణపతిమ్, లింగాష్టకం, బాలకనకయ్య, చిన్ని శిశివు, అన్నపూర్ణ, అల్లోనేరేళ్లో, పేరిణి కౌత్వం, వారాహి, అష్టలక్ష్మి, గరుడ గమన మొదలైన అంశాలను.. స్ఫూర్తి, నిత్యశ్రీ, గగనశ్రీ, సాన్విక, యోషిక, జూషిత, సహస్ర, ప్రణవి, మనస్వి తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
Similar News
News December 5, 2025
HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

గ్రేటర్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
News December 5, 2025
HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.


