News April 25, 2024
ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఓ <<13106495>>యువకుడిని మృత్యువు<<>> వెంటాడింది. మేడిపల్లిలోని సత్యనారాయణపురానికి చెందిన మధుసూదన్ రెడ్డి, సుష్మ దంపతుల కుమారుడు వర్షిత్ రెడ్డి (23) బీటెక్ పూర్తి చేశాడు. మంగళవారం నారాయణగూడలోని ఓ బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకునేందుకు బైకుపై బయలుదేరాడు. నల్లచెరువు ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. వెనక నుంచి వచ్చిన బస్సు మీది నుంచి వెళ్లగా మృతి చెందాడు.
Similar News
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
News September 15, 2025
HYD: రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్

మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
News September 13, 2025
రంగారెడ్డి: ఈనెల 15న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 15న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 55 కిలోల బరువు లోపు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.