News May 20, 2024
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు
వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో నాట్య గురువు అంజలి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ నృత్యకారి, మూషికవాహన, రుక్మిణి ప్రవేశం, బ్రహ్మంజలి, పలుకే బంగారమాయేనా, పుష్పాంజలి, అలివేలు మంగ, కులుకగ నడవరో, నమశ్సివాయతే, గోవర్థన గిరిధర, జతిస్వరం, కృష్ణ శబ్దం, గోవిందా గోవిందా తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.
Similar News
News December 13, 2024
HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు
సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
News December 13, 2024
HYD: Xలో అల్లు అర్జున్ బెయిల్ ట్రెండింగ్..!
HYDలో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ కాగా తాజాగా హైకోర్టు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు పొందిన నటుడి అరెస్ట్, బెయిల్ ట్విట్టర్ Xలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. HYDలో హీరో అల్లు అర్జున్ అరెస్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపింది.
News December 13, 2024
HYD: అరెస్ట్ ఎపిసోడ్.. పుష్పకు మరింత క్రేజ్
బన్నీ అరెస్టు వార్తతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీవీలలో ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఏం జరుగుతోందో అని టెన్షన్‌తో గడిపారు. అరెస్టు చేస్తారా, చేస్తే రిమాండ్ చేస్తారా, మరి బెయిల్ వస్తుందా అని టీవీలకు అతక్కుపోయారు. చివరకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు సీన్‌తో ఆయనకు మరింత క్రేజ్ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.