News June 1, 2024
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, తక్కువేమి మనకు, రామకోదండ రామ, శ్రీమన్నారాయణ, పలుకే బంగారమయేహ్న, వినరో భాగ్యం, వింతలు వింటివా యశోద, నాటకరంజిని పదవర్ణం, త్యాగరాజ కీర్తన అంశాలను లక్ష్మీప్రియా, సహస్ర, వైష్ణవి, రిధి, నిహారిక, హిరణ్య, ఈషా, సాన్విక, అధిత్రి, వైద్య, సంకీర్త్ ప్రదర్శించారు.
Similar News
News November 20, 2025
HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.
News November 20, 2025
HYD: మంత్రి శ్రీహరిని కలిసిన చిన్న శ్రీశైలం యాదవ్

మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి వాకిటి శ్రీహరిని చిన్న శ్రీశైలం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు.
News November 20, 2025
HYD: రాహుల్ ద్రవిడ్తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.


