News June 3, 2024
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.
Similar News
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.
News December 5, 2025
గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్ టాక్’

బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.


