News July 7, 2024
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.
Similar News
News November 26, 2025
ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.
News November 26, 2025
HYD: LOVEలో ఫెయిల్.. ఇన్ఫోసిస్ ఉద్యోగి సూసైడ్

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి (26) స్నేహితులతో కలిసి సింగపూర్ టౌన్షిప్‌లో అద్దెకుంటూ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో పవన్ తన రూమ్‌లో ఉరేసుకున్నాడు. స్నేహితులు గమనించి PSకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.
News November 26, 2025
HYD: వెంటాడుతున్న విషసర్పాలు!

హైదరాబాద్ శివారు ఏరియాలను విషసర్పాలు వెంటాడుతున్నాయి. ఘట్‌కేసర్, ప్రతాపసింగారంలో రక్తపింజర, కొండచిలువలు ప్రత్యక్ష్యమైన ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మొయినాబాద్‌లోనూ ఇదే భయం పట్టుకుంది. మొన్న మండల ఆఫీస్ సమీపంలో ఒక పామును స్థానికులు పట్టుకున్నారు. వరుస ఘటనలతో ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజల ప్రాణ రక్షణతో పాటు వన్య ప్రాణులనూ కాపాడాలని కోరుతున్నారు.


