News July 7, 2024
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.
Similar News
News October 12, 2025
RR: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News October 11, 2025
సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా ప్రజావాణి

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినందున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కావున రద్దుపరిచిన ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా సోమవారం నుంచి కొనసాగించడం జరుగుతుందని RR జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News October 11, 2025
RR: ఇంటి వద్దకే పోలియో చుక్కలు: DMHO

RR జిల్లాలో రేపటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి లలితాదేవి తెలిపారు. జిల్లాలో 155 మంది రూట్ సూపర్‌వైజర్లు, 6,204 మంది బూత్ టీమ్ మెంబర్లను నియమించామన్నారు. ఆయా బూత్‌లలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. మిగిలిన వారికి 13 నుంచి 15 వరకు ఇంటి వద్దకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.