News March 23, 2025
ఉప్పల్ స్టేడియంలో IPL.. ఆరెంజ్ ఆర్మీ (PHOTO)

ఉప్పల్ స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీతో కలకలలాడుతుంది. SRH VS RR మధ్య ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుండగా ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీ సందడి కనిపిస్తోంది. HYD క్రికెట్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ అంటే మామూలుగా ఉండదని.. డైలాగ్స్ వేస్తూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతుండగా ఆరెంజ్ ఆర్మీ ఫీవర్ స్పష్టంగా కనిపించేలా ఫోటో తీయగా వైరల్ అవుతుంది. CREDIT: ఫోటోగ్రాఫర్: పృథ్వి చౌదరి.
Similar News
News December 13, 2025
అల్లూరి జిల్లాలో పెరిగిన టమాట ధర..?

అల్లూరి జిల్లాలో టమాటా ధరకు రెక్కలు వచ్చాయి. అడ్డతీగల, రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి మండలాల్లో శనివారం రిటైల్గా కిలో రూ. 80 చొప్పున విక్రాయించారని వినియోగదారులు తెలిపారు. గత వారం రూ.60 ఉండగా ప్రస్తుతం రూ. 20 పెరిగిందన్నారు. ఈ ప్రాంతంలో అకాల వర్షాలు వలన టమాటా పంట దెబ్బ తినడంతో రాజమండ్రి, నర్సీపట్నం నుంచి అల్లూరికు తీసుకొచ్చి విక్రయిస్తున్నామని వ్యాపారులు అంటున్నారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.


