News March 19, 2025

ఉప్పల్ స్టేడియం రెడీ.. మరి హైదరాబాదీలు!

image

మరో రెండు రోజుల్లో HYDలో సిక్సర్ల మోత, అభిమానుల కేరింత మొదలవ్వనుంది. ఈనెల 23న ఉప్పల్‌లో మ్యాచ్ జరగనుంది.
MARCH 23 SRH vs RR
MARCH 27 SRH vs LSG
APRIL 6 SRH vs GT
APRIL 12 SRH vs PK
APRIL 23 SRH vs MI
MAY 5 SRH vs DC
MAY 10 SRH vs KKR
MAY 20 Qualifier 1
MAY 21 Eliminator
#SHARE IT

Similar News

News November 23, 2025

HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

image

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్‌ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

News November 23, 2025

ఇలా అయితే భవిష్యత్‌లో HYDకు గండమే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరద ప్రవాహాంతో వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.

News November 23, 2025

HYD: 25న బల్దియా సర్వసభ్య సమావేశం

image

మరో రెండున్నర నెలల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి మాత్రం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు, కాంగ్రెస్‌కు మధ్య మాటల యుద్ధం తప్పకపోవచ్చని సమాచారం.