News February 16, 2025
ఉప్పల్: CCLలో ఆది ఆట.. ఒకే ఓవర్లో 3 వికెట్లు

HYD ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సినీ క్రికెట్ లీగ్లో తెలుగు వారియర్స్ బౌలర్, హీరో ఆది ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి వారెవ్వా అనిపించారు. మూడు వికెట్లు తీయడంతో పాటు స్కోరు బోర్డును కట్టడి చేసినట్టు అయింది. మ్యాచ్ కీలక దశలో మలుపు తిరిగింది. ఆది ప్రదర్శనతో స్టేడియం మొత్తం కేరింతలు వేశారు. 5 ఓవర్ల తర్వాత స్కోర్ బోర్డు మెల్లగా స్లో అయింది. చెన్నై స్కోర్ 81-7గా ఉంది.
Similar News
News November 17, 2025
మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.

చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.