News February 16, 2025
ఉప్పల్: CCLలో ఆది ఆట.. ఒకే ఓవర్లో 3 వికెట్లు

HYD ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సినీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ బౌలర్, హీరో ఆది ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి వారెవ్వా అనిపించారు. మూడు వికెట్లు తీయడంతో పాటు స్కోరు బోర్డును కట్టడి చేసినట్టు అయింది. మ్యాచ్ కీలక దశలో మలుపు తిరిగింది. ఆది ప్రదర్శనతో స్టేడియం మొత్తం కేరింతలు వేశారు. 5 ఓవర్ల తర్వాత స్కోర్ బోర్డు మెల్లగా స్లో అయింది. చెన్నై స్కోర్ 81-7గా ఉంది.
Similar News
News April 10, 2026
భద్రాద్రి: తీవ్రంగా ఆయుష్ వైద్యుల కొరత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుర్వేద (ఆయుష్) వైద్యుల కొరత రోగులను వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అతి తక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉండటంతో హోమియోపతి, ఆయుర్వేద సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను నియమించాలని, తద్వారా సామాన్యులకు ప్రత్యామ్నాయ వైద్య సేవలను చేరువ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. # ప్రపంచ హోమియోపతి దినోత్సవం.
News April 10, 2026
నిర్మల్: అంగన్వాడీలకు కొత్త ‘స్మార్ట్’ ఫోన్లు

నిర్మల్‌లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల వివరాల నమోదు కోసం ప్రభుత్వం కొత్త స్మార్ట్ ఫోన్లను మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన 3జీ ఫోన్లు మొరాయించడంతో టీచర్లు పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. జిల్లాలోని 19 మండలాల పరిధిలో గల కేంద్రాల కోసం 881 స్మార్ట్ ఫోన్లు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని అంగన్‌వాడీ టీచర్లకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఆన్‌లైన్ పని మరింత సులభతరం కానుంది.
News April 10, 2026
చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


