News February 9, 2025

ఉప్పల్ MLA ఇంట్లో విషాదం

image

ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్‌పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News March 18, 2025

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన జర్నలిస్టులు

image

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలు విడుదలయ్యారు. సోమవారం నాంపల్లి కోర్టు యూట్యూబ్ జర్నలిస్టులకు రూ.25వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై యూట్యూబ్ జర్నలిస్టులు తమ ఛానల్లో ప్రసారం చేసిన ఓ వీడియోపై రిమాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

News March 18, 2025

రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

News March 18, 2025

HYD: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయికి Fits

image

ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కీసర శ్రద్ధ కళాశాలలో ఎకనామిక్ పరీక్ష జరుగుతోంది. హాల్‌కు వచ్చిన విద్యార్థిని ప్రవళిక పరీక్ష రాస్తుండగా ఫిట్స్‌ రావడంతో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాచారం ESIకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

error: Content is protected !!