News February 13, 2026

ఉప్పాడ హార్బర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కొత్తపల్లి మండలం ఉప్పాడ హార్బర్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. హార్బర్‌లోని రాళ్లగుట్టపై మృతదేహాన్ని గమనించిన మత్స్యకారులు స్థానికులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Similar News

News March 14, 2026

కృష్ణా: నడి రోడ్డుపైనే రుబాబు..!

image

ఉమ్మడి కృష్ణాలో రోడ్డు భద్రత, టార్గెట్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు సామాన్యుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. తనిఖీల్లో కేవలం బైక్‌లనే ఆపి, తాళాలు లాక్కుని యూట్యూబ్ ఛానళ్లతో వీడియోలు తీయించి నేరస్థుల్లా అవమానిస్తున్నారని చెబుతున్నారు. కార్లను వదిలేసి, బైకర్ల నుంచి రూ.150 నుంచి రూ.1500 వరకు తమ వ్యక్తిగత నంబర్లకు ఫోన్‌పే చేయించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 14, 2026

సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేస్తాం: కేంద్రం

image

నేషనల్ సెక్యూరిటీ యాక్ట్(NSA) కింద 6 నెలలుగా జైలులో ఉన్న పర్యావరణవేత్త <<17827658>>సోనమ్ వాంగ్‌చుక్‌<<>>ను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ‘లద్దాక్‌లో శాంతి, స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నాం. అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలకు సిద్ధం. ఇందులో భాగంగా సోనమ్ శిక్షను రద్దు చేస్తున్నాం’ అని పేర్కొంది. లద్దాక్‌లో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో గతేడాది SEP 26న సోనమ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

News March 14, 2026

గద్వాల: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు: కలెక్టర్

image

జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలు కానున్నాయి. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.