News February 26, 2025

ఉప్పునుంతల: DJ ఫ్యానుకు చీర చుట్టుకుని మృతి

image

పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఉప్పునుంతల మండలం ఈర్వటోనిపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ, గ్రామస్థుల వివరాలు.. పూర్యానాయక్ తండాకు చెందిన బుజ్జి(35) భర్తతో గ్రామంలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. ఊరేగింపులో ప్రమాదవశాత్తు బుజ్జి చీర DJ ఫ్యానుకు చుట్టుకుంది. గాయాలైన ఆమెను HYDకి తరలిస్తుండగా తెల్లవారుజామున మృతిచెందింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు.

Similar News

News November 20, 2025

NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.

News November 20, 2025

ములుగు: గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

image

58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అదేవిధంగా పలువురిని సన్మానించారు. గ్రంథాలయాలను మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

News November 20, 2025

మదనపల్లెలో 10 కిలోల టమాటాలు రూ.610

image

మదనపల్లెలో టమాటా ధరలు పైపైకి పోతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌కు గురువారం 135 మెట్రిక్ టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు రూ.610 అమ్ముడు పోగా.. రెండవ రకం రూ.580, మూడవ రకం రూ.500లతో కొనుగోలు జరుగుతున్నట్లు టమాటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. పంట దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వారు తెలిపారు.