News September 24, 2024
ఉప రాష్ట్రపతిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న అర్వింద్ సోమవారం ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
Similar News
News October 4, 2024
NZB: రీజియన్‌కు చేరిన 13 ఎలక్ట్రిక్ బస్సులు
నిజామాబాద్ రీజియన్‌కు మొదటి విడతగా 13 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారభించనున్నట్లు RM జానిరెడ్డి తెలిపారు. ముందుగా ఈ బస్సులను జేబీఎస్ రూట్లలో నడుపనున్నామని, ప్రత్యేకమైన సౌకర్యాలు గల ఈ బస్సుల్లో పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.230 చార్జీ ఉంటుందని RM వివరించారు.
News October 4, 2024
NZB: ‘సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి’
సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వచ్చే జనవరి మాసం నుంచి రాష్ట్ర ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించనున్న దృష్ట్యా, రైతులు సన్న రకాలకు చెందిన వరి ధాన్యం పండించేలా ప్రోత్సహించాలని సూచించారు.
News October 3, 2024
NZB: ‘ఈనెల 5లోగా DSC సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయండి’
డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం 1:3 నిష్పత్తిలో చేపడుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను ఈనెల 5లోగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ఈనెల 9న హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.