News January 3, 2025

ఉప వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ సభ్యుడు సమావేశం

image

షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా గురువారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ పీ.రంజిత్ భాషా హాజరయ్యారు. అనంతరం ఈ అంశంపై వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతిపత్రాలను రాజీవ్ రంజాన్ మిశ్రా స్వీకరించారు.

Similar News

News January 8, 2025

ట్రాక్టర్ కింద పడి నంద్యాల జిల్లా వ్యక్తి మృతి

image

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ కింద పడి నంద్యాల జిల్లా వ్యక్తి మృతి చెందారు. అందిన వివరాల మేరకు.. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన వెంకట చరణ్ రెడ్డి ట్రాక్టర్‌లో నంద్యాల నుంచి ధర్మవరానికి వెళ్తున్నారు. అతడు డ్రైవర్ పక్కన కూర్చోగా ముచ్చుకోట వద్ద ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపప్పూరు పోలీసులు తెలిపారు.

News January 8, 2025

శ్రీశైలంలో ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి తెలుసా?

image

భారతదేశంలో శ్రీశైలంలో మాత్రమే ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇష్ట కామేశ్వరి అమ్మవారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే కొలవబడే అమ్మవారు ప్రస్తుతం సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఎంత గొప్ప కోరికైనా ఇక్కడి అమ్మవారికి చెప్పుకుంటే కచ్చితంగా జరిగి తీరుతుందనేది భక్తుల నమ్మకం. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఇష్ట కామేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

News January 8, 2025

ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,500

image

ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,500 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 3,131 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,509, సరాసరి రూ.7,209, కనిష్ఠ ధర రూ.5,080తో అమ్మకాలు జరిగాయి.