News February 11, 2025

ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ

image

ఉమ్మడి గోదావరి జిల్లాలలో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూగా అధికారులు నిర్ధారించారు. తణుకు మండలం వేల్పూరు, తూ.గోలోని పెరవలి(M) కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన శాంపిల్స్‌ తో బర్డ్ ఫ్లూగా తేల్చారు. కానూరు గ్రామానికి 10కి.మీల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చికెన్, గుడ్లు తినడం తగ్గించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. కి.మీ పరిధిలోని కోళ్లను, గుడ్లను కాల్చి వేయాలని ఆదేశించారు.

Similar News

News December 13, 2025

మెస్సీ టూర్.. నిర్వాహకుడి అరెస్ట్

image

కోల్‌కతాలో మెస్సీ టూర్‌లో నెలకొన్న గందరగోళంపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాహకుడిని అరెస్ట్ చేసింది. టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్‌‌కు డబ్బులు రీఫండ్ చేయిస్తోంది. అటు ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మిస్‌మేనేజ్‌మెంట్‌కు గల కారణాలపై ఆరా తీస్తోంది. కాగా మెస్సీతో పాటు అభిమానులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

News December 13, 2025

18 నుంచి వినియోగదారుల వారోత్సవాలు: DSO

image

ఈనెల 18 నుంచి జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నందున ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించు కొని ఈనెల 18 మంది 24 వరకు కోనసీమ జిల్లాలు జాతీయ వినియోగదారుల వారోత్సవ వేడుకలు జరగనున్నాయని ఆయన తెలిపారు.

News December 13, 2025

2వ విడతలో 172 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 182 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172గ్రామ పంచాయతీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.