News February 11, 2025

ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ

image

ఉమ్మడి గోదావరి జిల్లాలలో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూగా అధికారులు నిర్ధారించారు. తణుకు మండలం వేల్పూరు, తూ.గోలోని పెరవలి(M) కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన శాంపిల్స్‌ తో బర్డ్ ఫ్లూగా తేల్చారు. కానూరు గ్రామానికి 10కి.మీల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చికెన్, గుడ్లు తినడం తగ్గించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. కి.మీ పరిధిలోని కోళ్లను, గుడ్లను కాల్చి వేయాలని ఆదేశించారు.

Similar News

News March 25, 2025

జస్టిస్ వర్మ నగదు ఘటన: ఎంపీలతో ధన్‌ఖడ్ కీలక సమావేశం

image

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం 4:30కు ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ‌ ఇంట్లో నగదు కాలిపోవడం, ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే NJACని అమల్లోకి తీసుకురావడంపై చర్చిస్తారని సమాచారం. నిన్న BJP, కాంగ్రెస్ ప్రెసిడెంట్స్‌ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

News March 25, 2025

బెట్టింగ్‌ భూతానికి అనకాపల్లి జిల్లా యువకుడు బలి

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం ప్రకారం.. గుండ్ల పోచంపల్లిలో నివాసముంటున్న సోమేశ్(29) బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమేశ్ అనకాపల్లి జిల్లావాసిగా పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2025

బట్టిపట్టే విధానానికి స్వస్తి పలకాలి: మతిన్ అహ్మద్

image

జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ ఎస్.డి మతిన్ అహ్మద్ మంగళవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న సంపూర్ణ సామర్థ్యాలను వెలికి తీయడం ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేసిన వారమవుతామన్నారు. చదువులో బట్టి పట్టే విధానానికి స్వస్తి పలులుకుతూ.. మ్యాక్ డ్రిల్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్‌లపై అవగాహన కల్పించాలన్నారు.

error: Content is protected !!