News November 22, 2024

ఉభయ గోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఐదుగురే.!

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు.‌ ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు,‌ 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.

Similar News

News November 8, 2025

రాజమండ్రి: తుఫాను పంట నష్టం అంచనాలు పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు డీఏఓ మాధవరావు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి, 1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మినుముకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు ఆయన వివరించారు.

News November 8, 2025

రాజమండ్రి: నేడు యథావిధిగా పాఠశాలలు

image

జిల్లాలో రెపు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని డీఈఓ వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలకు ప్రభుత్వం అక్టోబర్ నెల 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సెలవుల స్థానంలో వీటిని భర్తీ చేస్తున్నామన్నారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 14 రెండవ శనివారాల్లో పాఠశాలలు విధిగా పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించినట్లు డీఈవో చెప్పారు.

News November 8, 2025

ముంపు నివారణ చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరం: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ఇటీవల వరదలు, అధిక వర్షాల కారణంగా ప్రభావితమైన గ్రామాలలో ముంపు పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యలు అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను వల్ల పలు గ్రామాల్లో పంటలు ముంపుకు గురై రైతులు నష్టపోయారని కలెక్టర్ పేర్కొన్నారు.