News May 11, 2024

ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురంపై ఆసక్తి.. నేడు రామ్‌చరణ్

image

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురం క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News December 27, 2025

భీమవరం: ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

image

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శనివారం భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు S. శ్రీదేవి సందర్శించారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడారు. బెయిల్ వచ్చి కూడా జామీన్లు సమర్పించని కారణంగా విడుదల కాని ముద్దాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ముద్దాయిల భోజన వసతులను, వైద్య సదుపాయాలను ఆరా తీశారు.

News December 27, 2025

ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనవరి 1 ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈనెల 31 పంపిణీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీ అవసరమయ్యే నగదును సిద్ధం చేసుకోవాలన్నారు.

News December 27, 2025

ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

image

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.