News October 4, 2024

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

Similar News

News November 2, 2024

తూ.గో: పోలవరం పై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు

image

పోలవరం ప్రాజెక్ట్ పై గత వైసీపీ ప్రభుత్వ పనితీరుపై మంత్రి సుభాష్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయన్నారు. A అంటే అమరావతి, P అంటే పోలవరం నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

News November 1, 2024

ప్రయాణికుల రద్దీపై ప్రత్యేక ట్రైన్లు: సూపరింటెండెంట్ రమేష్

image

దీపావళి, దసరా పండగల నేపథ్యంలో వివిధ ప్రాంతాల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విజయవాడ విశాఖపట్నం ఏర్పాటు చేసినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..08457 విశాఖ విజయవాడ, 08568 విజయవాడ విశాఖ ట్రైన్ నవంబర్ ఒకటి నుంచి 13 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. జన సాధారణ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్‌ను ప్రయాణీకుఅుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 1, 2024

కాకినాడ: చనిపోయిన ముగ్గురు ఎవరంటే?

image

కాకినాడ(D) కాజులూరు(M) సలపాకలో గురువారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తం నలుగురిపై దాడి చేయగా.. ఒకే కుటుంబానికి చెందిన బత్తుల రమేశ్, చిన్ని, రాజు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ముగ్గురు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ విక్రాంత్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.