News August 9, 2024
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✧ADB: నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
✧ఖానాపూర్: ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిద్దాం.
✧జన్నారం: భక్తి శ్రద్దల మధ్య నాగపంచమి.
✧ADB: అన్నా. వదినపై దాడి.. కేసు నమోదు.
✧ADB: ఆర్టీసీ బస్సు అద్దెకి తీసుకున్న వారు10 శాతం రాయితీ.
Similar News
News December 12, 2025
ADB: రేపు అన్ని పాఠశాలలకు వర్కింగ్ డే

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం పని దినంగా ఉంటుందని జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 7న సెలవు ప్రకటించినందుకు బదులుగా ఈ నెల 13న అన్ని పాఠశాలలు యథావిధంగా పనిచేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News December 11, 2025
హీరాపూర్: కోడలిపై అత్త విజయం

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 11, 2025
ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.


